ICC World Cup 2019: Tahir Gets Jonny Bairstow For golden Duck!! | Onbeindia Telugu

2019-05-30 205

ICC cricket World Cup 2019 (CWC 2019), the Eoin Morgan’s England cricket team will lock horns with South Africa cricket team led by Faf du Plessis at The Kennington Oval in London. An embarrassing first round exit in cricket world cup 2015 prompted them to rethink of their approach towards the 50-over cricket.
#engvsa
#iccworldcup2019
#jonnybairstow
#imrantahir
#joeroot
#cricket
ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుకు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ రెండో బంతికే ఆ జట్టు ఓపెనర్ జానీ బెయిర్‌స్టో పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఓపెనర్లుగా జేస‌న్ రాయ్‌, జానీ బెయిర్‌స్టోలు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెప్లిస్‌ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ తొలి ఓవ‌ర్‌ను సీనియర్ స్పిన్న‌ర్ ఇమ్రాన్ త‌హీర్‌తో వేయించాడు. మొదటి బంతికి జేసన్ రాయ్ ఒక పరుగు సాధించాడు. ఆ తర్వాత రెండో బంతికి బెయిర్‌స్టో ఔట్ చేశాడు.
తాహిర్ వేసిన బంతి బెయిర్ స్టో బ్యాట్‌ను తాకి నేరుగా వికెట్ కీప‌ర్ డీకాక్ చేతుల్లోకి వెళ్లింది. వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ఓ ఓపెన‌ర్ డ‌కౌట్ కావ‌డం ఇదే మొద‌టిసారి. గోల్డెన్ డ‌కౌట్ అయిన తొలి ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ కూడా బెయిర్‌స్టో కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ 5 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 29 పరుగులు చేసింది.
అంతకముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీని ఘనంగా ఆరంభించాలని ఇరు జట్లూ పట్టుదలతో ఉన్నాయి. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ రికార్డుకి దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా చేరువలో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో ఆమ్లా మరో 90 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 8వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు.